మహేష్‌ బాబు కుమార్తె సితారకు లక్కీ ఛాన్స్‌

,హైదరాబాద్‌:  డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మక యానిమేషన్‌ మూవీ ఫ్రాజెన్‌-2 తెలుగులోకి  డబ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. విడుదలకుముందే యువతలో ఎంతో  క్రేజ్‌ సంపాదించుకున్న ఈ మూవీ సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్‌  హీరో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కుమార్తె ఘట్టమనేని సితార తన గొంతును దానం చేస్తోంది. ప్రతిష్టాత్మక డిస్నీ లాంటి నిర్మాణ సంస్థ చిత్రంలోని  బేబీ ఎల్సా పాత్రకు  సితార డబ్బింగ్‌ చెప్పనున్నారు. ఇప్పటికే  తన ఆటపాటలతో ఆకట్టుకుంటూ మహేష్‌బాబు అభిమానులను మురిపిస్తున్న బేబీ సితార  తన సరికొత్త టాలెంట్‌తో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మరోవైపు యువరాణి ఎల్సా పాత్రకు  ప్రముఖ నటి నిత్యామీనాన్‌ డబ్బింగ్‌  చెప్తున్నారు. దీంతో హలీవుడ్‌లో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఫ్రోజెన్ 2 రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో మంచి జోష్‌ను క్రియేట్ చేస్తోంది.